Samsung: రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే!

best samsung phones under rs 10000

  • ఎంతో నమ్మకమైన బ్రాండ్ గా గుర్తింపు పొందిన శాంసంగ్
  • అత్యంత ఖరీదైన ఫోన్ల నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల దాకా అందుబాటులో...
  • ఇందులో మంచి ఫీచర్లున్న ఐదు ఫోన్లు ఇవేనంటున్న టెక్ నిపుణులు

ఎలక్ట్రానిక్స్ రంగంలో శాంసంగ్ కంపెనీకి ఎంతో గుర్తింపు ఉంది. అదే స్థాయిలో స్మార్ట్ ఫోన్ల తయారీలోనూ మంచి పేరు సాధించింది. యాపిల్ ఐఫోన్ కు దీటుగా శాంసంగ్ ఫోన్లను తయారు చేస్తోంది. అదే సమయంలో సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా బడ్జెట్ ఫోన్లనూ ప్రవేశపెట్టింది. అందులో రూ.10 వేలలోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ శాంసంగ్ ఫోన్లను టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఏ06
ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో రూ.8,799 కే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ లో 6.7 అంగుళాల డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14
అమెజాన్ లోనే రూ.8,748 ధరతో అందుబాటులో ఉంది. ఇందులో 6.6 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 గిగాహెడ్జ్ రీఫ్రెష్ రేటును సపోర్టు చేస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాతో డ్యూయల్ కెమెరా ఉంది. బడ్జెట్ ధరలో ఇది బెటర్ ఫోన్ అని నిపుణులు పేర్కొంటున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం14
ఇది కూడా అమెజాన్ లో రూ.8,410 ధరతో అందుబాటులో ఉంది. దీనిలోనూ 6.6 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 గిగాహెడ్జ్ రీఫ్రెష్ రేటును సపోర్టు చేస్తుంది. ఇందులో 6000 ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ ఉంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాతో త్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 

శాంసంగ్ గెలాక్సీ ఎం05
కేవలం రూ.6,999 ధరకే అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫోన్ ఇది. ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది. దీనిలో 6.7 అంగుళాల ఎల్ సీడీ స్క్రీన్, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ05
6.7 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉన్న ఈ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో రూ.7,835 ధరతో లభిస్తుంది. బడ్జెట్ ఫోన్లలో ఇది మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఆర్టికల్ లో పేర్కొన్న ఫోన్లు, వాటి స్పెసిఫికేషన్లు, ధరలు టెక్ నిపుణులు వెల్లడించిన వివరాల మేరకు పేర్కొన్నవే. సమయానుసారం వాటి ధరలు మారే అవకాశం ఉంటుంది. వాటిని గమనించాలి.

  • Loading...

More Telugu News