Dil Raju: హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాతో దిల్ రాజు భేటీ

Dil Raju meets Ravi Gupta

  • ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కార్యకలాపాలపై చర్చ
  • థియేటర్ లైసెన్స్‌ల గడువు సులభంగా ఉండాలనే అంశంపై చర్చ
  • సమావేశంలో పాల్గొన్న ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు ఈరోజు తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. సినిమా పరిశ్రమలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కార్యకలాపాలపై చర్చిస్తున్నారు.

థియేటర్ల లైసెన్స్‌ల గడువు సులభంగా ఉండాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగింది. దిల్ రాజుతో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, పలువురు ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.

Dil Raju
Telangana
Congress
  • Loading...

More Telugu News