Gone Prakash Rao: కేటీఆర్ కు కవిత పోటీ అవుతున్నారు: గోనె ప్రకాశ్ రావు

Kavitha is becoming competition Gone Prakash Rao

  • జైలుకు వెళ్లిన వాళ్లంతా సీఎంలు అవుతున్నారన్న గోనె ప్రకాశ్ రావు
  • కవిత సీఎం కావాలనుకుంటున్నారనే సమాచారం తన వద్ద ఉందని వ్యాఖ్య
  • కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసి పోయిందని విమర్శ

జైలుకు వెళ్లిన వాళ్లంతా సీఎంలు అవుతున్నారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే జైలుకు వెళ్లారని చెప్పారు. కేటీఆర్ కూడా జైలుకు వెళ్లాలనుకుంటున్నారని అన్నారు. కేటీఆర్ కు కవిత పోటీ అవుతున్నారని చెప్పారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కవిత ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారనే సమాచారం తన వద్ద ఉందని గోనె ప్రకాశరావు చెప్పారు. బీసీల కోసం కవిత ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీసీలపై కవితకు ఇప్పుడే ప్రేమ పుట్టుకొచ్చిందా? అని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసి పోయిందని... పరిస్థితిని గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం కొంత ఓపిక పట్టాలని అన్నారు.

  • Loading...

More Telugu News