K Kavitha: కవిత ఫోన్ తర్వాత... ఇందిరాపార్క్ మహాసభకు పోలీసుల అనుమతి!
- ఉదయం నుంచి సభకు అనుమతి కోసం ప్రయత్నాలు
- పోలీసుల నుంచి సాయంత్రం దాకా రాని అనుమతి
- హైదరాబాద్ సీపీకి స్వయంగా ఫోన్ చేసి విజ్ఞప్తి చేసిన కవిత
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు ఇందిరాపార్క్ వద్ద నిర్వహించతలపెట్టిన బీసీ సభకు పోలీసులు అనుమతిచ్చారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తాము బీసీ సభ నిర్వహించుకుంటున్నామని, ఇందుకు అనుమతించాలని ఆమె హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. కవిత, తెలంగాణ జాగృతి విజ్ఞప్తికి పోలీసులు సానుకూలంగా స్పందించారు.
రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద సభ జరగనుంది. మహాసభకు హైదరాబాద్ నగర పోలీసులు అనుమతులు ఇవ్వడంతో బీసీ మహాసభ కోసం తెలంగాణ జాగృతి ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ సభకు అనుమతి కోసం ఉదయం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో కవిత నేరుగా నగర సీపీకి ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సభను నిర్వహిస్తున్నామని అడ్డుకోవద్దని కోరారు.