Virat Kohli: మ‌ళ్లీ విరాట్ చేతికి టెస్టు జ‌ట్టు ప‌గ్గాలు..!

Virat Kohli Set For Leadership Role In Tests Report Says Rohit Sharma Unlikely To Continue as a Test Cricketer

  • ఫామ్ లేక‌ తీవ్ర ఇబ్బంది ప‌డుతున్న హిట్‌మ్యాన్‌ 
  • బీజీటీ సిరీస్‌లో ఘోరంగా విఫ‌ల‌మైన రోహిత్‌
  • కెప్టెన్‌గా, ఆట‌గాడిగా ఫెయిల్ కావ‌డంతో పెరిగిన‌ విమ‌ర్శ‌లు 
  • ఆసీస్ సిరీస్ త‌ర్వాత‌ టెస్టుల్లో కొన‌సాగే అవ‌కాశం లేద‌న్న 'టైమ్స్ ఆఫ్ ఇండియా' 
  • రోహిత్ త‌ప్పుకుంటే కోహ్లీ జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్టే అవకాశం ఉంద‌న్న   నివేదిక 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శ‌ర్మ టెస్టుల్లో కొన‌సాగే అవ‌కాశం దాదాపు లేద‌నేది ప‌లు నివేదిక‌ల సారాంశం. దీనికి కార‌ణం ఇటీవల బ్యాటింగ్‌లో అతని పేలవమైన ఫామ్‌. దీంతో రోహిత్ తీవ్ర విమర్శలకు గురయ్యాడు. అలాగే అత‌ని వ‌య‌సును కూడా మ‌రో కార‌ణంగా చూపుతున్నారు ప‌లువురు మాజీలు. అదే సమయంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ భారత్ ఘోర‌ ఓటమి తర్వాత అతని నాయకత్వంపై కూడా ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. ఈ నేప‌థ్యంలోనే ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత రోహిత్ టెస్ట్ క్రికెటర్‌గా కొనసాగే అవకాశం లేద‌ని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' నివేదిక పేర్కొంది.

ఒకవేళ రోహిత్ టెస్టుల నుంచి నిష్క్రమిస్తే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్టే అవకాశం ఉంద‌ని తెలిపింది. దీనికి కార‌ణం ఇటీవ‌ల భారత మాజీ కెప్టెన్ ఫీల్డ్‌లో ఎక్కువగా కల్పించుకోవ‌డంతో పాటు జట్టు ఆట‌గాళ్ల‌ను ఉత్సాహ ప‌రిచేందుకు త‌ర‌చూ ప్ర‌సంగించ‌డం చేస్తున్నాడ‌ని నివేదిక పేర్కొంది.

ఇక భారత్‌కు అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌ల‌లో కోహ్లీ ఒక‌డు. అతను టీమిండియాకు 68 మ్యాచ్‌లలో సార‌థ్యం వ‌హిస్తే.. 40 మ్యాచ్‌లు గెలిపించాడు. అలాగే ఇందులో 17 ప‌రాజ‌యాలు ఉన్నాయి. అటు ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న మొదటి భారత కెప్టెన్ కూడా (2018/19లో 2-1 విజయం) కోహ్లీనే కావ‌డం విశేషం. 

అలాగే ప్ర‌స్తుతం టెస్టు జట్టులో సీనియ‌ర్ కూడా కోహ్లీనే. ఒక్క జ‌స్ప్రీత్ బుమ్రాను మిన‌హాయిస్తే జ‌ట్టు ప‌గ్గాలు అందుకునే ఆట‌గాడు మరొకరు లేరు. సో.. కోహ్లీకే సార‌థ్య బాధ్య‌త‌లు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News