Jani Master: పగవారు కూడా జైలుముఖం చూడకూడదు: జానీ మాస్టర్!

Jani Master Interview

  • ఏం జరుగుతుందో అర్థం కాలేదన్న జానీ మాస్టర్ 
  • భార్యపిల్లలు గుర్తొచ్చేవారని వెల్లడి 
  • తల్లి అనారోగ్యం కంగారు పెట్టేదని వివరణ
  • తన భార్య అండగా నిలబడుతుందని తెలుసని ఉద్వేగం   


జానీ మాస్టర్ కి టాలీవుడ్ లో కొరియోగ్రఫర్ గా మంచి పేరు ఉంది. ఒక కారణంగా ఆయన ఈ మధ్య జైలుకి వెళ్లి వచ్చారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన గురించిన వార్తలే కనిపించాయి. ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన చర్చలే నడిచాయి. ఆ తరువాత ఆయన బెయిల్ పై బయటికి వచ్చారు. తాజాగా 'జాఫర్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"నేను జైలుకి వెళ్లిన తరువాత .. అసలు నా లైఫ్ లో ఏం జరుగుతోంది అనేది నాకు అర్థం కాలేదు. సాయంత్రం కాగానే నా పిల్లలు .. నా భార్య .. మా అమ్మ గుర్తొచ్చారు. మా అమ్మకి ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు .. ఆమె ఏమైపోతుందో అని కంగారు పడ్డాను. నా చుట్టూ చాలామంది ఉంటారు. వాళ్లు చూస్తే ఏమైనా అనుకుంటారేమోనని వాష్ రూమ్ కి వెళ్లి పెద్దగా ఏడ్చేవాడిని. జరిగిన సంఘటన విషయంలో నా భార్య సుమలత నాకు అండగా నిలబడుతుందని తెలుసు" అని అన్నారు. 

" జీవితంలో జైలుకి వెళ్లకూడదు. పగవారు .. శత్రువులైనా సరే జీవితంలో జైలు ముఖం చూడకూడదనే నేను కోరుకుంటాను. నేనంటే పవన్ కల్యాణ్ గారికి .. చరణ్ గారికి చాలా ఇష్టం. నాకు కష్టం వచ్చినప్పుడు వాళ్లు సైలెంటుగా ఉన్నారనే ప్రచారం జరిగింది. నాపై వాళ్లకి నమ్మకం ఉండటం వల్లనే మౌనంగా ఉన్నారు. కొన్నిసార్లు మౌనమే మాట్లాడుతుంది. ఆ సమయంలో నాగబాబుగారు .. నా అభిమానులు ట్వీట్ చేశారు. వాళ్లకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని చెప్పారు.

Jani Master
Sumalatha
Jaffar
  • Loading...

More Telugu News