Ravi Shastri: రోహిత్ కుర్రాడేమీ కాదుగా.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Ravi Shastri Sensational Comments on Rohit Sharma

  • ఇటీవ‌ల ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది ప‌డుతున్న రోహిత్ శ‌ర్మ
  • బీజీటీ సిరీస్‌లో ఘోరంగా విఫ‌ల‌మైన టీమిండియా కెప్టెన్
  • హిట్‌మ్యాన్‌పై మరింత పెరిగిన‌ విమ‌ర్శ‌లు 
  • బీజీటీ సిరీస్ త‌ర్వాత అత‌డు కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌న్న ర‌విశాస్త్రి
  • రోహిత్ రిటైర్మెంట్ తీసుకున్నా ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌ని వ్యాఖ్య‌  

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఇటీవ‌ల ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో అటు సార‌థిగా ఇటు ఆటగాడిగా కూడా ఫెయిల్ కావ‌డంతో హిట్‌మ్యాన్‌పై విమ‌ర్శ‌లు మ‌రింత పెరిగాయి. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు మాజీ కోచ్ ర‌విశాస్త్రి తాజాగా రోహిత్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. 

రోహిత్ కుర్రాడేమీ కాదని.. ఎంతో నైపుణ్యం క‌లిగిన కుర్రాళ్లు జ‌ట్టులో చోటు కోసం సిద్ధంగా ఉన్నార‌ని అన్నాడు. బీజీటీ సిరీస్ త‌ర్వాత రోహిత్ కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌న్నాడు. అత‌డు రిటైర్మెంట్ తీసుకున్నా ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌ని ర‌విశాస్త్రి చెప్పుకొచ్చాడు. దీంతో అత‌ని వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

  • Loading...

More Telugu News