AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సమావేశంలో ఆమోదించబోయే కీలక అంశాలు ఇవే..!
- ఈ ఉదయం 11 గంటలకు భేటీ కానున్న ఏపీ కేబినెట్
- క్లీన్ ఎనర్జీకి సంబంధించి రూ. 83 వేల కోట్ల పెట్టబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్
- కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఈ ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఈ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించి, వాటికి ఆమోదం తెలపనున్నారు.
కేబినెట్ చర్చించబోయే అంశాలు ఇవే:
- వైజాగ్ మిలీనియం టవర్స్ లో రూ. 80 కోట్ల పెట్టుబడితో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ సంస్థ ఏర్పాటుపై చర్చ.
- క్లీన్ ఎనర్జీలో భాగంగా కొత్తగా ఐదు సంస్థల ఏర్పాటు విషయమై రూ. 83 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.
- కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి 592 ఎకరాల్లో రూ. 12,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.
- కర్నూలు జిల్లా హోసూరు, పెద్ద హుల్తిలో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ 1,800 ఎకరాల్లో రూ. 2 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఆమెదం తెలపనున్న కేబినెట్.
- కడప జిల్లాలో కొండాపురం, మైలవరంతో పాటు నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో క్లీన్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ 1,080 ఎకరాల్లో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 65 వేల కోట్ల పెట్టుబడులతో 11 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం.
- జాన్ కోకిరిల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులతో 40 ఎకరాల్లో 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్.
- సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా సంస్థ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ ల కోసం రూ. 1,046 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.
- అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ సంస్థ రూ. 1,174 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.
- నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడులతో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.
కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ భేటీలో గడిచిన ఆరు నెలల పాలన, 2025 ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులపై మంత్రులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.