Kidnap: 15 ఏళ్ల బాలుడితో ప్రేమ.. కలిసి జీవించేందుకు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన యువతి!

Young Woman Kidnapped 15 Year Old Boy In Chennai

  • చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌లో ఘటన
  • ట్యూషన్‌కు వచ్చే బాలుడితో ప్రేమలో పడిన యువతి
  • మరో స్నేహితుడి సాయంతో పుదుచ్చేరికి
  • అక్కడ కలిసి జీవించాలని నిర్ణయం
  • ముగ్గురిని చెన్నై తీసుకొచ్చిన పోలీసులు

15 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడిన 23 ఏళ్ల యువతి అతడితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం మరో స్నేహితుడి సాయం తీసుకుంది. ఆపై ముగ్గురూ కలిసి ఊరు విడిచి వెళ్లిపోయారు. చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌లో జరిగిందీ ఘటన. పదో తరగతి ఫెయిలైన బాలుడు స్థానికంగా ట్యూషన్‌లో చేరాడు. అక్కడ ట్యూషన్లు చెప్పే మహిళ సోదరి అతడిని ప్రేమించింది. ఈ క్రమంలో డిసెంబర్ 16న బయటకు వెళ్లిన బాలుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 

బాలుడికి ట్యూషన్ చెబుతున్న మహిళ చెల్లెలు, కేకే నగర్‌కు చెందిన రాహుల్‌, బాలుడు కలిసి పుదుచ్చేరికి వెళ్లినట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి ముగ్గురినీ చెన్నైకి తీసుకొచ్చారు. బాలుడు, యువతి ప్రేమించుకుంటున్నారని, కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్న వారు రాహుల్ సాయంతో పుదుచ్చేరికి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. యువతిపై కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న ఆల్ ఉమెన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News