Kotharu Satyanarayana Choudary: సినిమాలకు ముహూర్తం పెట్టే సిద్ధాంతి సత్యనారాయణ చౌదరి కన్నుమూత

Kotharu Satyanarayana Choudary Passed Away

  • నాలుగైదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సత్యనారాయణ
  • ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోలేకపోయారన్న వైద్యులు
  • స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని సింగరాజుపాలెం

తెలుగు సినిమాలకు ముహూర్తం పెట్టే సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ చౌదరి నిన్న కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం ఆయన స్వగ్రామం. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితుడిగా, సినిమాల ముహూర్త సిద్ధాంతిగా ఆయన పేరు సంపాదించుకున్నారు.

నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ నుంచి మాత్రం ఆయన కోలుకోలేకపోయారని వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య అనసూయ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె నాగమణి ఉన్నారు.

  • Loading...

More Telugu News