Srikanth: విలన్ గానే స్థిరపడతానేమోనని అనుకున్నాను: హీరో శ్రీకాంత్

Srikanth Interview

  • సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన శ్రీకాంత్ 
  • విలన్ గా 15 సినిమాలు చేశానని వివరణ 
  • హీరోగా 'వన్ బై టూ'తో హిట్ కొట్టానని వెల్లడి 
  • వరుస అవకాశాలతో పాటు సక్సెస్ లు వచ్చిపడ్డాయని వ్యాఖ్య


శ్రీకాంత్... ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న నటుడు. చాలా వేగంగా 100 సినిమాలను పూర్తి చేసిన హీరో. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి థియేటర్లకు రానున్న 'గేమ్ ఛేంజర్'లో ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

"సినిమాల్లోకి రావడం ఒక ఎత్తు... వచ్చిన తరువాత నిలదొక్కుకోవడం ఒక ఎత్తు. ఇండస్ట్రీకి వెళ్లాలి అనే ఆలోచన ఉండేదే తప్ప, ఇక్కడ హీరోగానా... విలన్ గానా ఏం చేయాలనే ప్లానింగ్ ఉండేది కాదు. 'పీపుల్స్ ఎన్ కౌంటర్'... 'మధురానగరిలో' తరువాత వరుసగా 15 సినిమాలలో విలన్ గా చేశాను. ఇక మనం ఇక్కడ విలన్ గానే సెటిల్ కావాలేమోనని అనుకున్నాను. అలాంటి సమయంలో నన్ను హీరోను చేస్తానని తమ్మారెడ్డి భరద్వాజ గారు మాట ఇచ్చారు" అని అన్నాడు. 

"భరద్వాజ గారు 'వన్ బై టూ' సినిమాను నిర్మించారు. అందులో హీరోగా నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తరువాత 'దొంగ రాస్కెల్'... 'ఆమె'... 'వినోదం' ఇలా వరుసగా హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. ఆలా చేసిన సినిమాలన్నీ హిట్ అవుతూ వచ్చాయి. అది భగవంతుడి అనుగ్రహంగానే నేను భావిస్తూ ఉంటాను. ఇక్కడ మనం ఏదీ ప్లాన్ చేయలేము. సక్సెస్ లే మనలను ముందుకు తీసుకుని వెళుతూ ఉంటాయి" అని చెప్పాడు. 

  • Loading...

More Telugu News