Telangana: న్యూఇయర్ పేరుతో వచ్చే లింక్స్ పట్ల జాగ్రత్త: తెలంగాణ పోలీసులు
- సైబర్ నేరగాళ్లు న్యూఇయర్ పేరుతో లింక్స్ పంపిస్తారన్న పోలీసులు
- అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయవద్దని సూచన
- ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచన
న్యూఇయర్ పేరుతో వచ్చే లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. 2025 కొత్త ఏడాది నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు న్యూఇయర్ పేరుతో లింక్స్‌ను పంపించి ఓపెన్ చేయమని చెప్పే ఆస్కారం ఉంటుందని, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయవద్దని సూచించారు. అవగాహన లేకుండా లింక్స్‌ను క్లిక్ చేస్తే మోసపోతారని హెచ్చరించారు.
తెలియని లేదా కొత్త నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని హెచ్చరించారు. కొత్త ఏడాదిని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు సూచన చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగేలా, ఇతరుల మనోభావాలు రెచ్చగొట్టేలా కార్యక్రమాలు చేయవద్దన్నారు. పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.