2025: 2025కి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్

New Zealand welcomes 2025

  • ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
  • మనకంటే అరగంట ముందు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్న నేపాల్, బంగ్లాదేశ్
  • రష్యాలో రెండు సార్లు కొత్త సంవత్సర వేడుకలు

కొత్త సంవత్సర వేడుకలకు యావత్ ప్రపంచం సిద్ధమయింది. మన దేశంలో కూడా పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది. 2025 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. 

మన కాలమానం ప్రకారం సాయంత్రం 3.45 గంటలకు న్యూజిలాండ్ కు చెందిన చాతమ్ ఐలాండ్స్ 2025లోకి అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాలో మన కంటే ఐదున్నర గంటల ముందు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మన పొరుగు దేశాలు భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే 30 నిమిషాల ముందు నూతన సంవత్సరంలోకి అడుగుపెడతాయి.

రేపు ఉదయం మనకు 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. రష్యాలో కొత్త సంవత్సర వేడుకలను రెండు సార్లు జరుపుకుంటారు. గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1న.... పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. సౌదీ అరేబియా, చైనా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాలు జనవరి 1న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవు. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.

  • Loading...

More Telugu News