Maharashtra: కేరళలో రాహుల్, ప్రియాంక విజయాలు సాధించడంపై మహారాష్ట్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

maharashtra minister nitesh rane sparks row with kerala mini pak comment then clarifies

  • రాహుల్, ప్రియాంక గాంధీలపై మహా మంత్రి నితీశ్ రాణే సంచలన వ్యాఖ్యలు
  • కేరళను మినీ పాకిస్థాన్‌గా అభివర్ణించిన నితీశ్ రాణే 
  • ఉగ్రవాదులంతా ఓట్లు వేయడం వల్లనే రాహుల్, ప్రియాంక గెలిచారన్న నితీశ్ రాణే  

కేరళలో రాహుల్, ప్రియాంక గాంధీ విజయాలపై మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేరళలోని వాయినాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ తర్వాత ప్రియాంక గాంధీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి విజయాలపై నితీశ్ రాణే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇంతకూ .. నితీశ్ రాణే ఏమన్నారంటే.. కేరళ మినీ పాకిస్థాన్. అక్కడ ఉగ్రవాదులంతా రాహుల్, ప్రియాంకలకు ఓట్లు వేశారు. అందుకే వారిద్దరూ గెలిచారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నితీశ్ రాణే వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

ప్రతిపక్షాలు నితీశ్ రాణే వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఏమిటని కాంగ్రెస్ నిలదీస్తోంది. ఆతనికి మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని, తక్షణమే మంత్రివర్గం నుంచి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తొలగించాలని డిమాండ్ చేసింది. దీంతో నితీశ్ రాణే స్పందిస్తూ .. కేరళలో లవ్ జిహాదీ, మత మార్పిడుల ఘటనల కారణంగా తాను పాకిస్థాన్‌తో పోల్చినట్లు వివరణ ఇచ్చారు. 
 
నితీశ్ రాణే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటి సారి కాదు. మొదటి నుంచి వివాదాస్పద, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటారు. సెప్టెంబర్‌లో ముస్లింలను కొడతానంటూ బెదిరిస్తూ చేసిన ప్రసంగంపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అలాగే ఆయనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పరువు నష్టం దావా కూడా వేశారు. నితీశ్ రాణే కేంద్ర మాజీ మంత్రి నారాయణ రాణే వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు.  

  • Loading...

More Telugu News