Jayamangala Venkataramana: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన జయమంగళ వెంకటరమణ

Jayamangala Venkataramana joins Janasena party

  • ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ
  • ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా
  • వెంకటరమణతో పాటు జనసేనలో చేరిన గంజి చిరంజీవి
  • జనసేన కండువాలు కప్పి ఆహ్వానం పలికిన పవన్ కల్యాణ్

ఇటీవలే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కైకలూరు నియోజకవర్గం నేత జయమంగళ వెంకటరమణ నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ఆయన అర్ధాంగి రాధ కూడా జనసేనలో చేరారు. వారికి పవన్ కల్యాణ్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీకి తగిన విధంగా సేవలు అందించాలని సూచించారు. 

మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News