Perni Jayasudha: పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు

Once again notices issued to Perni Jayasudha

  • పేర్ని నాని భార్య జయసుధ పేరిట గోడౌన్
  • గోడౌన్ నుంచి బియ్యం మాయం అయినట్టు గుర్తింపు
  • ఇటీవల రూ.1.68 కోట్ల జరిమానా
  • పెరిగిన షార్టేజికి అదనంగా రూ.1.67 కోట్లు చెల్లించాలని తాజా నోటీసులు

గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని అర్ధాంగి జయసుధకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. తొలుత 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయంటూ రూ.1.68 కోట్ల జరిమానా విధించారు. ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. మొత్తమ్మీద గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు తేల్చారు. 

ఈ క్రమంలో, పెరిగిన షార్టేజికి కూడా జరిమానా చెల్లించాలంటూ జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News