Samsung: సామ్‌సంగ్ గెలాక్సీ ఎం35 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్

Samsung introduced discount on Samsung Galaxy M35 5G

  • ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ లో రూ.5,000 తగ్గింపు ఆఫర్
  • రూ.15,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో 5జీ ఫోన్
  • 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ సహా ఆకట్టుకునే పలు ఫీచర్లు

సామ్‌సింగ్ ‘ఎం సిరీస్’ స్మార్ట్‌ఫోన్లు బాగా పాప్యులారిటీ పొందిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా ఈ ఏడాది జులైలో విడుదలైన ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎం35’ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కస్టమర్లను ఊరించే భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ బేస్ మోడల్‌ అసలు ధర రూ.19,999 కాగా, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. కేవలం రూ.14,999లకే ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు దక్కింది.

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా అదనపు తగ్గింపును కూడా కస్టమర్లు పొందవచ్చు. అంతేకాదు, కస్టమర్లకు ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ.727 చెల్లింపుతో ఫోన్‌ను కొనవచ్చు. ఈ ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.  6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌‌తో 6.62-అంగుళాల డిస్‌ప్లే, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌, 1000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, 25 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌, అదనపు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. 

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఫోన్ వెనుకవైపు మల్టిపుల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రధానమైనది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా ఉన్నాయి.

  • Loading...

More Telugu News