Chandrababu: సీఎం చంద్ర‌బాబు చొర‌వ‌.. ఆరు నెల‌ల్లో పూరి గుడిసె నుంచి డాబా ఇంటికి పేద కుటుంబం

CM Chandrababu Promise to Poor Family Fulfilled

  • జులై 1న తాడేప‌ల్లి మండ‌లం పెనుమాక‌లో పింఛ‌న్ పంపిణీ ప్రారంభ‌ కార్య‌క్ర‌మానికి వెళ్లిన సీఎం
  • గుడిసెలో ఉంటున్న ఓ పేద కుటుంబం ఇంటికి వెళ్లి పింఛ‌న్ అందించిన చంద్ర‌బాబు
  • వారు గుడిసెలో నివాసం ఉండ‌టానికి గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్న సీఎం 
  • డాబా క‌ట్టించి ఇస్తాన‌ని హామీ ఇచ్చి.. ఇంటి మంజూరు ప‌త్రాల‌ అంద‌జేత‌
  • సర్కార్ డాబా క‌ట్టించి ఇవ్వ‌డంతో జ‌న‌వ‌రిలో గృహ‌ప్ర‌వేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్న ఫ్యామిలీ

ఏపీ సీఎం చంద్ర‌బాబు చొర‌వ‌తో ఓ పేద కుటుంబం ఆరు నెల‌ల్లోనే పూరి గుడిసె నుంచి డాబా ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతోంది. గుడిసెలో నివాసం ఉంటున్న ఆ కుటుంబాన్ని చూసి చ‌లించిపోయిన ముఖ్య‌మంత్రి వెంట‌నే డాబా ఇల్లు నిర్మించి ఇస్తామ‌ని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. అన్న మాట ప్ర‌కారం చంద్ర‌బాబు ఆరు నెల‌లు తిర‌క్కుండానే ఆ పేద కుటుంబాన్ని డాబా ఇంటికి య‌జ‌మానుల‌ను చేశారు. 

వివ‌రాల్లోకి వెళితే.. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత చంద్ర‌బాబు ఈ ఏడాది జులై 1న గుంటూరు జిల్లా తాడేప‌ల్లి మండ‌లం పెనుమాక‌లో పింఛ‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న బాణావ‌త్ రాములు నాయ‌క్‌, సీత‌మ్మ దంప‌తుల ఇంటికి వెళ్లి పింఛ‌న్ అందించారు. 

ఆ స‌మ‌యంలో ఆ ఫ్యామిలీ గుడిసెలో నివాసం ఉండ‌టానికి గ‌ల కార‌ణాల‌ను సీఎం చంద్ర‌బాబు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబం చెప్పిన కార‌ణాల‌తో చ‌లించిపోయిన ముఖ్య‌మంత్రి డాబా క‌ట్టించి ఇస్తాన‌ని హామీ ఇవ్వ‌డంతో పాటు మంజూరు ప‌త్రాల‌ను అంద‌జేశారు. 

తాజాగా సర్కార్ డాబా క‌ట్టించి ఇవ్వ‌డంతో రాములు నాయ‌క్ కుటుంబం జ‌న‌వ‌రిలో గృహ‌ప్ర‌వేశానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు చూపిన చొర‌వ ప‌ట్ల ఆ ఫ్యామిలీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. సీఎంకు, మంత్రి నారా లోకేశ్‌కి రుణ‌ప‌డి ఉంటామ‌ని ఆ కుటుంబం చెప్పుకొచ్చింది.  

  • Loading...

More Telugu News