Mann Ki Baat: ‘మన్ కీ బాత్’లో అక్కినేని నాగేశ్వరరావును గుర్తుచేసుకున్న మోదీ

Modi Names Akkineni Nageswarrao In His Mann Ki Baat Speech

  • ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని 'మన్ కీ బాత్' కార్యక్రమం
  • తాజా ఎపిసోడ్ లో సినిమా రంగం గురించి మాట్లాడిన ప్రధాని  
  • తెలుగుతో సహా పలు భాషలకు చెందిన సినీ ప్రముఖుల పేర్ల ప్రస్తావన

ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' లో ప్రధాని నరేంద్ర మోదీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చూపిస్తూ టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో మోదీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు.

వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను తొలిసారిగా మన దేశంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ప్రసంగంలో తెలుగుతో సహా పలు భాషలకు చెందిన సినీరంగ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని పేర్కొన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు.

  • Loading...

More Telugu News