Guntur Road: నాటి గుంతల రోడ్డే నేడు ఇలా రహదారిగా మారింది
- ఇంటికో స్విమ్మింగ్ పూల్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టు
- నాడు వ్యంగ్యంగా పోస్టులు.. నేడు అభివృద్ధికి చిహ్నమంటూ నెటిజన్ల వ్యాఖ్యలు
- కాంట్రాక్టర్ కు కూటమి సర్కారు పెండింగ్ నిధులు విడుదల చేయడంతో రోడ్డుకు మోక్షం
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఇంటికో స్విమ్మింగ్ పూల్ ఉందంటూ గతంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. గుంటూరులోని గుజ్జనగుండ్ల నుంచి పలకలూరు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారడం, వాటిలో వర్షం నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. 2022 జులైలో ఈ రోడ్డుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసి నెటిజన్లు నాటి వైసీపీ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ కామెంట్లు పెట్టారు. కాంట్రాక్టర్ కు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టడంతో పనులు ఆగిపోయాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పెండింగ్ బకాయిలు క్లియర్ చేస్తూ నిధులు విడుదల చేసింది. దీంతో గుజ్జనగుండ్ల - పలకలూరు రోడ్డుకు మోక్షం లభించింది. పనులు వేగంగా పూర్తిచేసిన కాంట్రాక్టర్.. రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు చక్కగా తయారైంది. ఈ క్రమంలోనే ఈ రోడ్డుకు సంబంధించిన ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ ప్రభుత్వంలో అలా.. కూటమి ప్రభుత్వంలో ఇలా.. అంటూ నాటి గుంతల రోడ్డు, నేటి తారు రోడ్డు ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. మార్పు కళ్ల ముందే కనిపిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.
2022 జులైలో..
2024 డిసెంబర్ లో..