HYDRA: హైడ్రా వల్ల కొత్తగా ప్లాట్లు, ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు: హైడ్రా కమిషనర్

Hydra commissioner says HYDRA protected 200 acre land

  • హైడ్రాకు ఇప్పటి వరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయన్న ఏవీ రంగనాథ్
  • హైడ్రా ఇప్పటి వరకు 200 ఎకరాల భూమిని కాపాడిందని వెల్లడి
  • సాంకేతిక పరిజ్ఞానంతో చెరువుల సరిహద్దులు, బఫర్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి

హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో అక్రమ నిర్మాణాలపై అవగాహన పెరిగిందని, ఇప్పుడు కొత్తగా ప్లాట్లు, ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... హైడ్రాకు ఇప్పటి వరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయన్నారు. మున్సిపాలిటీలలో అనధికార లేదా అక్రమ నిర్మాణాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.

హైడ్రా ఇప్పటివరకు 200 ఎకరాల భూమిని కాపాడినట్లు చెప్పారు. ఇప్పటివరకు 8 చెరువులను, 12 పార్కులను కాపాడిందని తెలిపారు. చెరువులకు సంబంధించి 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు చిత్రాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి పారదర్శకంగా, శాస్త్రీయంగా ముందుకు వెళుతున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్ జోన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

హైడ్రాకు డాప్లర్ రాడార్‌ను సమకూర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. డాప్లర్ రాడార్ ఉంచే కచ్చితమైన వివరాలను సేకరించగలుగుతామన్నారు. హైడ్రా భూముల సంరక్షణతో పాటు సమర్థవంతంగా వరద నివారణ చర్యలు చేపడుతుందన్నారు.

  • Loading...

More Telugu News