RK Roja: రోజా కుమార్తెకు ఇంటర్నేషనల్ అవార్డు
- తన ప్రతిభతో ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్న రోజా కుమార్తె అన్షు మాలిక
- తాజాగా గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫెస్టివల్‌లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డు అందుకున్న అన్షు
- నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన వేడుకలో ఇంటర్నేషనల్ ఆవార్డు స్వీకరణ
- మల్టీ ట్యాలెంటెడ్ అంటూ నెటిజన్ల ప్రశంసలు
సినీ నటి, మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది. కుమార్తెకు ఇంటర్నేషనల్ అవార్డు రావడం పట్ల ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపింది.
వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా మంచి పేరు సంపాదించుకున్న రోజా కుమార్తె ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకుంది. మరో పక్క రైటర్‌గానూ సత్తా చాటుతోంది. అన్షు గతంలో ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే నవల కూడా రాసింది. దీనికి గానూ బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియా అవార్డును అందుకుంది.
తాజాగా నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫెస్టివల్‌లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో అన్షు మాలిక గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డు అందుకుంది. ఈ విషయాన్ని అన్షు స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
అవార్డు స్వీకరిస్తున్న ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రోజా తన కుమార్తెను అభినందించారు. అన్షు మల్టీ ట్యాలెంటెడ్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.