South Central Railway: అయ్యప్ప భక్తుల నుంచి స్పందన కరవు.. శబరిమల ప్రత్యేక రైళ్ల రద్దు

South Central Railway Cancels Special Trains To Sabarimala

  • ప్రకటించిన 14 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • మహాకుంభమేళాకు 16 ప్రత్యేక రైళ్ల ప్రకటన
  • 20 ప్రత్యేక రైళ్లు మరికొన్ని నెలల పాటు పొడిగింపు

అయ్యప్ప భక్తుల నుంచి స్పందన కరవవడంతో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రకటించిన 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శబరిమల రద్దీ నేపథ్యంలో మౌలాలి-కొట్టాయం, కాగజ్‌నగర్-కొల్లాం, కాచిగూడ-కొట్టాయం, నర్సాపూర్-కొల్లాం, నాంపల్లి-కొట్టాయం మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే, అయ్యప్ప భక్తుల నుంచి అనుకున్నంతగా స్పందన లేకపోవడంతో ఈ రైళ్లను రద్దు చేసినట్టు తాజాగా ప్రకటించింది. 

మరోవైపు, జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానున్న మహాకుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరి 18, 21 తేదీల్లో మౌలాలి-అజాంగఢ్, 20, 23 తేదీల్లో అజాంగఢ్-మౌలాలి, 19న మౌలాలి-గయ, 21న గయ-మౌలాలి, 22న మౌలాలి-గయ, 24న గయ-మౌలాలి, 25న కాచిగూడ-పట్నా, 27న పట్నా-కాచిగూడ మధ్య రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. 

అలాగే, హైదరాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే 20 ప్రత్యేక రైళ్లను పొడిగించినట్టు అధికారులు చెప్పారు. వీటిలో సికింద్రాబాద్-రామాంతపురం-సికింద్రాబాద్ రైలును జనవరి 29 నుంచి మార్చి 28 వరకు, కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును జనవరి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు, నాందేడ్-ఈరోడ్-నాందేడ్ రైలును జనవరి 24 నుంచి మార్చి 30 వరకు, కాచిగూడ-నాగర్‌కోయల్-కాచిగూడ రైలును జనవరి 24 నుంచి మార్చి 30 వరకు పొడిగించినట్టు అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News