Perni Nani: పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వు
- గౌడౌన్ లో రేషన్ బియ్యం మాయమైన కేసు
- జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ పై కేసు నమోదు
- ఈ నెల 30న తీర్పును వెల్లడిస్తామన్న న్యాయమూర్తి
రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో వాదనలు ముగిశాయి. జయసుధ తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వరరావు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నెల 30న తీర్పును వెల్లడిస్తామని తెలిపారు.
పేర్ని నాని భార్య పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ లో నిల్వ ఉంచిన 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమయింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస్ తేజపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.