Manmohan Singh: తెలంగాణ ఉద్యమం సమయంలో మన్మోహన్ సింగ్ అందించిన సహకారం మరువలేనిది: కేసీఆర్
- తెలంగాణ ఏర్పాటు వరకు మన్మోహన్ విశేష సహకారం అందించారన్న కేసీఆర్
- తెలంగాణ సమాజానికి ఆయన అత్యంత ఆప్తుడు అన్న కేసీఆర్
- ఆర్థిక సంస్కరణల రూపకర్తగా అద్భుతమైన సేవలు అందించారని కితాబు
తెలంగాణ ఉద్యమం సమయం నుంచి రాష్ట్రం ఏర్పాటు వరకు మన్మోహన్ సింగ్ అందించిన సహకారాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. భారత్‌లో ఆర్థిక సంస్కరణల రూపకర్తగా మన్మోహన్ సింగ్ దేశానికి అద్భుతమైన సేవలు అందించారని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్‌తో తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు.
తెలంగాణ కోసం తాము ఉద్యమించిన సమయంలో ప్రతి సందర్భంలోనూ ఆయన మనోధైర్యాన్ని నింపారని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో ఆయన అందించిన సహకారం మరువలేనిదన్నారు. తెలంగాణ సమాజానికి ఆయన అత్యంత ఆప్తుడు అన్నారు. ఆయనకు బీఆర్ఎస్ తరఫున ఘననివాళి అర్పిస్తున్నామన్నారు.
మన్మోహన్ అంత్యక్రియలకు హాజరుకావాలంటూ కేటీఆర్ ను, ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు.