Samantha: హాలిడే మూడ్ లో సమంత.. ఇన్ స్టా పోస్ట్ వైరల్

Samantha Ruth Prabhu enjoys a cozy holiday season
  • బెడ్ పై పడుకున్న ఫొటో పోస్ట్ చేస్తూ కవిత
  • క్రిస్మస్ వేడుకలతో పాటు గణేశుడికీ పూజలు
  • ఇంట్లో హిందూ దేవుళ్ల చిత్రాలను షేర్ చేసిన నటి
ప్రముఖ హీరోయిన్ సమంత ప్రస్తుతం హాలిడే మూడ్ లో ఉన్నారు. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా చిల్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశారు. జీసస్ ను ప్రార్థిస్తూనే గణేశుడికీ పూజలు చేసినట్లు సమంత ఫొటోలు చూస్తే తెలుస్తోంది. తాజాగా సమంత తన ఇన్ స్టా అకౌంట్ లో బెడ్ పై పడుకున్న ఫొటోస్ షేర్ చేస్తూ.. హ్యీపీ హాలీడేస్ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. క్రిస్టియన్ కుటుంబంలో జన్మించినప్పటికీ సమంత హిందూ సంప్రదాయాలను కూడా పాటిస్తారు. హిందూ దేవుళ్లకు కూడా పూజలు చేస్తుంటారు. 

తాజా పోస్ట్ లో సమంత ఇంట్లో గణేశుడు, దుర్గామాతల చిత్రాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ‘సిటాడెల్ : హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత.. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ సిరీస్ లో నటిస్తున్నారు. మరోవైపు, సమంత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజా పోస్టును చూస్తే సమంతకు వ్యాధి ఇంకా పూర్తిగా తగ్గలేదని, ఫొటోలలో ఆమె డల్ గా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Samantha
Holidays
Instagram
Citadel
Raktha Brahmanda
Viral Pics

More Telugu News