Obama: ఒబామా పుస్తకంలో మన్మోహన్ సింగ్ ప్రస్తావన.. ఏం రాశారంటే..!
- అసాధారణ ప్రతిభావంతుడు, నిజాయతీపరుడని కొనియాడిన ఒబామా
- భారతీయుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తారని ప్రశంసలు
- లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేశారని మన్మోహన్ పై పొగడ్తలు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో మన్మోహన్ సింగ్ పేరును ప్రస్తావించారు. ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో ఒబామా తన జ్ఞాపకాలను పుస్తకరూపంలో తీసుకురాగా.. అందులో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తావనా ఉంది. మన్మోహన్ ను అత్యంత అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తిగా ఒబామా పేర్కొన్నారు. ఆలోచనాపరుడు, నిజాయతీ కలిగిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు.
నిరంతరం భారతీయుల సంక్షేమం కోసమే ఆలోచించారని, పాటుపడ్డారని ఒబామా పేర్కొన్నారు. ప్రతిభావంతుడైన ఆర్థికవేత్తగా, ప్రధానిగా ఆయన చేపట్టిన సంస్కరణలతో భారత్ లో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని కొనియాడారు. తెలివైన, ఆలోచనాత్మకమైన, కపటం లేని నిజాయతీతో కూడిన వ్యక్తిత్వం మన్మోహన్ సింగ్ సొంతమని ఒబామా తన పుస్తకంలో రాసుకున్నారు.