NIMS: ఓపీ సేవలు నిలిపివేయడంతో నిమ్స్ వద్ద రోగుల ఆందోళన

patients protest at nims due to suspension of op services

  • మన్మోహన్ మృతితో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ రోజు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్
  • పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో ఓపీ సేవలను నిలిపివేసిన వైద్యులు
  • సెలవు నుంచి వైద్యసేవలను మినహాయించాలని కోరుతూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేసిన రోగులు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు (శుక్రవారం) సెలవు ప్రకటించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. సెలవు విషయం తెలియని చాలా మంది రోగులు పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. 

వైద్యులు ఓపీ సేవలను నిలిపివేయడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్య సేవలు మినహాయించి మిగతా వాటికి సెలవు ప్రకటించాలని రోగులు కోరుతున్నారు. వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. 

  • Loading...

More Telugu News