Australia vs India: బాక్సింగ్ డే టెస్టు.. ఆసీస్ ఆలౌట్
- మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 474 రన్స్‌కు ఆలౌట్
- భారీ సెంచరీ (140) తో రాణించిన స్టీవ్ స్మిత్
- జస్ప్రీత్ బుమ్రాకు 4 వికెట్లు
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ స్కోర్ 311/6 తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టు మరో 163 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత భారీ శతకం (140)తో రాణించగా.. సామ్ కాన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖావాజా (57), లబుషేన్ (72) అర్ధ శతకాలు బాదారు.
ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ త్రుటిలో హాఫ్ సెంచరీ (49) చేజార్చుకున్నాడు. స్మిత్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు కమ్మిన్స్ ఏకంగా 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా. రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 8 పరుగులకే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 3 రన్స్‌కే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 9/1 (3 ఓవర్లు).. క్రీజులో యశస్వి జైస్వాల్ (05), కేఎల్ రాహుల్ (0) ఉన్నారు.