Manmohan Singh Demise: మన్మోహన్ అస్తమయం... వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం!

Centre declared seven days national mourning for Manmohan Singh demise

  • తుదిశ్వాస విడిచిన మన్మోహన్ సింగ్
  • రాజకీయాలకు అతీతంగా తీవ్ర విచారం వ్యక్తం చేసిన నేతలు
  • శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ భేటీ
  • పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం చెందారు. ఆయన మృతి రాజకీయాలకు అతీతంగా అందరినీ విషాదానికి గురిచేసింది. మన్మోహన్ మృతి నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. 

రేపటి (డిసెంబరు 27) ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. కాగా, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News