Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి హాజరుకాని చిరంజీవి.. కారణం ఇదే!
- రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ప్రారంభం
- చర్చనీయాంశంగా మారిన చిరంజీవి గైర్హాజరు
- చిరంజీవి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ప్రారంభమయింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరయ్యారు.
సినీ పరిశ్రమ తరపున మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని ప్రచారం జరిగింది. అయితే, ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు. చిరంజీవి ఎందుకు రాలేదనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, హైదరాబాద్ లో లేకపోవడం వల్లే సమావేశానికి చిరంజీవి రాలేకపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నట్టు సమాచారం.
సినీ ఇండస్ట్రీ నుంచి నాగార్జున, వెంకటేశ్, దిల్ రాజు, మురళీమోహన్, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, నితిన్, శివ బాలాజీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ, పలువురు నిర్మాతలు, 'మా' అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ కు చెందిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.