tirumala vaikunta dwara darshan: శ్రీవారి భక్తులకు అలర్ట్ .. జనవరి 9న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ

tirumala vaikunta dwara darshan free tokens released on january january 9th says ttd eo

  • తిరుమలలో జనవరి 10 నుంచి పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు
  • శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈవో వెల్లడి
  • 9వ తేదీ ఉదయం నుంచి 91 కౌంటర్ల ద్వారా లక్షా 20 వేల టోకెన్లు జారీ చేయనున్నామన్న ఈవో

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 10, 11, 12 తేదీలకు .. జనవరి 9న టోకెన్లు జారీ చేయనున్నారు. తదుపరి రోజులకు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. 

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీకి 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి లక్షా 20 వేల టోకెన్లు విడుదల చేస్తామని తెలిపారు. 

భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు లేని భక్తులకు ఈ పది రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని స్పష్టం చేశారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, సర్వదర్శనం టోకెన్లు జారీ కేంద్రాలను బుధవారం ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించి సమీక్ష జరిపారు. 

  • Loading...

More Telugu News