Anurag Thakur: భార‌త సినిమాను టాలీవుడ్ ప్ర‌పంచ‌ప‌టంపై నిలిపింది: ఎంపీ అనురాగ్ ఠాకూర్

Some Trying To Pull Down Telugu Actors Anurag Thakur Backs Allu Arjun

  • టాలీవుడ్‌పై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్ర‌శంస‌లు
  • తెలుగు సినిమా సేవ‌ల్ని దేశం, ప్రపంచం గుర్తించింద‌న్న ఎంపీ
  • బ‌న్నీపై తెలంగాణ పోలీసుల చర్యలపై స్పందించిన బీజేపీ నేత‌
  • తెలుగు నటుడి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొంద‌రు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్య‌

బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ టాలీవుడ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌త చిత్ర ప‌రిశ్ర‌మ‌ను టాలీవుడ్ ప్ర‌పంచ‌స్థాయిలో నిలిపింద‌ని కొనియాడారు. అలాగే 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన నేప‌థ్యంలో నటుడు అల్లు అర్జున్‌పై తెలంగాణ పోలీసుల చర్యలపై ఆయ‌న స్పందించారు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీకి మద్దతుగా నిలిచారు. కావాల‌నే కొంద‌రు తెలుగు నటుడి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.  

ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ.. "భార‌త సినీ పరిశ్రమలో తెలుగు నటీనటుల సహకారం అమోఘం. వారు భారతీయ సినిమాను ప్రపంచపటంపై నిలిపారు. కానీ కొంతమంది తెలుగు నటులను క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా చూస్తే.. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అల్లు అర్జున్‌ని జాతీయ అవార్డు, చిరంజీవిని లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు వ‌రించాయి. తెలుగు సినిమా సేవ‌ల్ని యావత్ దేశం, ప్రపంచం గుర్తించింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'పుష్ప', 'కేజీఎఫ్‌', 'బాహుబలి ' వంటి చిత్రాలు ఇండియన్‌ సినిమాకి ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. 

రాజకీయాలకు బ‌దులు చ‌ర్చ‌లు జ‌రిపి వివాదాల‌కు ముగింపు ప‌ల‌కాలి. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేల ప్రకటనలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి" అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

  • Loading...

More Telugu News