Narendra Modi: కెన్ - బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మోదీ

Modi launches kenbetwa river link project

  • మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో శంకుస్థాపన కార్యక్రమం
  • రెండు నదుల నీటిని ప్రాజెక్టు నమూనాలో పోసిన మోదీ
  • నదుల అనుసంధానం ద్వారా లక్షలాది రైతు కుటుంబాలకు లబ్ధి

కెన్ - బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో జరిగిన కార్యక్రమంలో శంకుస్థాపన చేశారు. రెండు నదుల నీటిని ప్రాజెక్టు నమూనాలో ప్రధాని పోశారు. అనంతరం రిమోట్ బటన్ సాయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జయంతిని పురస్కరించుకుని ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు నదుల అనుసంధానం ద్వారా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని లక్షలాది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. సాగునీటితో పాటు తాగునీటి సమస్య కూడా తీరనుంది.

  • Loading...

More Telugu News