Chiranjeevi: మెగా స్టార్ స్టన్నింగ్ ఫొటోలు.. మరోసారి పాత చిరంజీవిని గుర్తు చేశారు!
![Age is Truly Running Backwards for this Man the Mega Star](https://imgd.ap7am.com/thumbnail/cr-20241225tn676befef3db23.jpg)
మెగా స్టార్ చిరంజీవికి సంబంధించిన తాజా ఫొటోలు మరోసారి పాత రోజులను గుర్తుకు తెచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన తాజా ఫొటోల్లో చిరు స్టన్నింగ్ లుక్ చూస్తే.. ఈయనకు వయసు పెరగడం లేదు.. తగ్గుతుంది అని అనిపించడం ఖాయం. 69 ఏళ్ల వయసులోనూ మెగా స్టార్ నవ యువకుడిలా కనిపిస్తున్నారు.
ఇక చిరు సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన 'బింబిసారా' ఫేం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో సినిమా చేయనున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన కూడా వచ్చింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇలా యువ హీరోలకు పోటీగా చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.