Rohit Sharma: బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయబోయే స్థానం ఖరారు?

Reports Saying that Rohit Sharma To Open For India In Boxing Day Test Against Australia

  • తిరిగి ఓపెనర్ అవతారం ఎత్తనున్న కెప్టెన్!
  • 3వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్న కేఎల్ రాహుల్
  • ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్న భారత్
  • రేపట నుంచి ఎంసీజీ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం

ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపటి (గురువారం) నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఎంసీజీ (మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్) వేదికగా జరగనున్న ఈ బాక్సింగ్ డే టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయనున్నాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపింది. కేఎల్ రాహుల్ మూడవ నంబర్ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నట్టు తెలిసిందని పేర్కొంది.

కాగా, గత రెండు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. దీంతో బాక్సింగ్ డే టెస్ట్ నుంచి తిరిగి ఓపెనర్‌గా రంగంలోకి దిగనున్నాడని పేర్కొంది. అయితే, బ్యాటింగ్ ఆర్డర్‌లో శుభ్‌మాన్ గిల్ ఏ స్థానంలో ఆడతాడనేదానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

కాగా, సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తవ్వగా ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేశాయి. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో బాక్సింగ్ డే టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి. మ్యాచ్‌కు వేదికైన ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ) స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే అంచనాలున్నాయి. అందుకే ఇద్దరు స్పినర్లతో బరిలోకి దిగేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లను తుది జట్టులోకి తీసుకోనున్నారు. ఈ సమీకరణంలో తెలుగు కుర్రాడు, గత మూడు మ్యాచ్‌ల్లో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి చోటు కోల్పేయే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

  • Loading...

More Telugu News