RC 16: 'ఆర్‌సీ 16'పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు

DOP Rathnavelu Interesting Update on RC 16

  • బుచ్చిబాబు సానా, రామ్‌చ‌రణ్ కాంబోలో 'ఆర్‌సీ 16'
  • ప్ర‌స్తుతం మైసూర్‌లో చిత్రీక‌ర‌ణ జరుపుకుంటున్న‌ట్లు ర‌త్న‌వేలు ట్వీట్‌
  • చరణ్ సరసన క‌థానాయిక‌గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్
  • కీలక పాత్రలో కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌
  • ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ స్వరకర్త  

'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబ‌ల్‌ స్టార్ రామ్‌చ‌రణ్‌ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మైసూర్‌లో ప్రారంభమైంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథతో ఈ మూవీ తెర‌కెక్కుతున్న‌ట్లు స‌మాచారం. ఇక చెర్రీకి 16వ చిత్రం ఇది. అందుకే ప్రస్తుతం 'ఆర్‌సీ 16' వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం మైసూర్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. ఈ టీమ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉందంటూ షూటింగ్ స్పాట్‌లోని ఒక ఫొటోను పంచుకున్నారు. 'రంగ‌స్థ‌లం' త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన క‌థానాయిక‌గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా. దేవ‌ర‌తో జాన్వీ టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ స్వరకర్త.

  • Loading...

More Telugu News