New Delhi: ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు... రాజధానిని కప్పేసిన పొగమంచు

Delhi airport issues advisory as flights may get affected amid dense fog

  • తెల్లవారుజామున 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
  • 100 మీటర్ల దూరంలోని వాహనం కూడా కనిపించని వైనం
  • విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని పొగమంచు కప్పేసింది. ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఉత్తర భారతం వణుకుతోంది. ఢిల్లీలో మంచు కురుస్తుండటంతో 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించడం లేదు. గాలి నాణ్యత కూడా 334గా నమోదైంది. వాతావరణ శాఖ ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

ఢిల్లీలో పొగమంచు కారణంగా పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

క్యాట్-3 (విజిబిలిటి సరిగా లేని పరిస్థితులలో సురక్షిత ల్యాండింగ్ కి సహకరించే సాంకేతికత) లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగవచ్చునని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రకటన చేసింది. ప్రయాణికులు విమానాల రాకపోకలకు సంబంధించి ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మంచుదుప్పటి కప్పుకుంది. జమ్మూ కశ్మీర్‌లో మంచు కురుస్తోంది. మంచు కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో రోడ్లు మూసివేశారు.

  • Loading...

More Telugu News