Cricket: కోహ్లీ ఇన్​కం ట్యాక్స్​ రూ.66 కోట్లా..? భారత క్రికెటర్లు ఎంతెంత ఐటీ కడుతున్నారో తెలుసా?

list of the most taxpaying indian cricketers

  • మన దేశంలో క్రికెట్‌ అంటే విపరీతమైన మోజు
  • అందుకే క్రికెటర్లకు ఆటతోపాటు ప్రకటనలతోనూ ఆదాయం
  • ఏటా వందల కోట్ల సంపాదన.. పదుల కోట్లలో ఆదాయ పన్ను కడుతున్న తీరు

మన దేశంలో క్రికెట్‌ అంటే ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారికి ఆటతో బీసీసీఐ, ఐపీఎల్‌ నుంచి వచ్చే డబ్బులే కాదు... ప్రకటనల్లో నటించడం ద్వారా, వ్యాపారాల ద్వారా, పెట్టుబడుల ద్వారా బోలెడంత ఆదాయం వస్తుంటుంది. అందుకు తగినట్టుగా ఆదాయ పన్ను (ఐటీ) కడుతూ ఉంటారు కూడా. అందులో ఏటా వందల కోట్లలో సంపాదించి పదులకోట్లలో పన్ను కడుతున్న క్రికెటర్లు కూడా ఉన్నారు. అందులో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి జాతీయ మీడియా కథనాల ప్రకారం చూస్తే...

కోహ్లీ టాప్‌.. ధోనీ సెకండ్‌..
క్రికెట్‌ కింగ్‌ గా పేరుపొందిన విరాట్‌ కోహ్లీ ఈ జాబితాలో కూడా టాప్‌ లో ఉన్నారు. ఆయన 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.66 కోట్ల ఆదాయ పన్ను చెల్లించారు. ట్యాక్స్‌ రేట్ల ప్రకారం చూస్తే ఆయన ఆదాయం ఆ ఒక్క ఏడాదిలో సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విరాట్‌ కోహ్లీ తర్వాతి స్థానాల్లో మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, క్రికెట్‌ దేవుడుగా పేరుపొందిన సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నారు.

2023-24లో అత్యధిక ఐటీ కట్టిన క్రికెటర్లు
ర్యాంక్
క్రికెటర్ పేరు
కట్టిన పన్ను
1
విరాట్ కోహ్లీ
రూ.66 కోట్లు
2
ఎంఎస్ ధోనీరూ.38 కోట్లు
3సచిన్ టెండూల్కర్రూ.28 కోట్లు
4సౌరవ్ గంగూలీరూ.23 కోట్లు
5హార్దిక్ పాండ్యారూ.13 కోట్లు
6రిషభ్ పంత్రూ.10 కోట్లు
7అజింక్య రహనేరూ.8 కోట్లు
8జస్ ప్రీత్ బుమ్రారూ.7 కోట్లు
9శిఖర్ ధావన్రూ.6 కోట్లు
10కేఎల్ రాహుల్రూ.5 కోట్లు

  • Loading...

More Telugu News