Jagan: కూటమి ప్రభుత్వం ఏం సాధించిందని కార్పొరేటర్లు టీడీపీలోకి వెళుతున్నారు?: కడప కార్పొరేటర్లతో జగన్

Jagan meeting with Kadapa YSRCP corporators

  • కడప కార్పొరేటర్లతో జగన్ భేటీ
  • ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా
  • భవిష్యత్తులో మనందరికీ మంచి రోజులు వస్తాయని వ్యాఖ్య

వైసీపీకి చెందిన కడప మున్సిపల్ కార్పొరేటర్లతో ఆ పార్టీ అధినేత జగన్ ఈరోజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇడుపులపాయలో జరిగిన ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ... ఇటీవల పార్టీ మారిన కార్పొరేటర్లను వారి విజ్ఞతకే వదిలేద్దామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏం సాధించిందని కార్పొరేటర్లు టీడీపీలోకి వెళుతున్నారని ప్రశ్నించారు. ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని... సమస్యలు ఉంటే కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

గతంలో తాను కూడా 16 నెలలు జైల్లో ఉన్నానని... తన బెయిల్ కోసం తన భార్య ఎంతో ఇబ్బంది పడిందని జగన్ చెప్పారు. తాను పడ్డ బాధలు ఈ ప్రపంచంలో ఇంకెవరూ పడి ఉండరని అన్నారు. ఎవరూ పార్టీ మారాల్సిన అవసరం లేదని... తాను మళ్లీ సీఎం అయితే మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు సీఎం అయినట్టేనని చెప్పారు. భవిష్యత్తులో మనందరికీ మంచి రోజులు  వస్తాయని తెలిపారు. ఆ తర్వాత కార్పొరేటర్లతో వేర్వేరుగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News