Vijayasai Reddy: మేము ఏ కూటమిలో చేరం: విజయసాయిరెడ్డి

We will not join any block says Vijayasai Reddy

  • ఎన్డీయే, ఇండియా కూటమికి సమ దూరంలో ఉంటామన్న విజయసాయి
  • రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని వ్యాఖ్య
  • చంద్రబాబు చేతిలో ప్రజలు నాలుగోసారి మోసపోయారన్న గుడివాడ

వైసీపీ ఏ కూటమిలో చేరదని... తమది తటస్థ వైఖరి అని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్డీయే, ఇండియా కూటమికి సమ దూరంలో ఉంటామని చెప్పారు. ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని అన్నారు. ప్రాంతీయ పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. జమిలి ఎన్నికలపై తమ పార్టీ అధినేత జగన్ ఆలోచనకు అనుగుణంగా జేపీసీ ఎదుట తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ... 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్పిన పని   చేయలేదని అన్నారు. చంద్రబాబు చేతిలో ప్రజలు నాలుగోసారి మోసపోయారని చెప్పారు.

  • Loading...

More Telugu News