Matt Gaetz: డగ్స్ కోసం, బాలికతో శృంగారం కోసం వేలాది డాలర్లు చెల్లించిన ట్రంప్ మాజీ అటార్నీ జనరల్!

Ex Trump attorney general pick paid thousands for drugs and sex with minor

  • ట్రంప్ హయాంలో అటార్నీ జనరల్‌గా పనిచేసిన మాట్ గేట్ట్
  • 17 ఏళ్ల బాలికతో లైంగిక సంబంధం కలిగి ఉండడం, డ్రగ్స్ కలిగి ఉన్నట్టు యూఎస్ ఎథిక్స్ కమిటీ నిర్ధారణ
  • ఫ్లోరిడా అత్యాచార చట్టాలను గేట్జ్ ఉల్లంఘించినట్టు పేర్కొన్న నివేదిక
  • 2017-2020 మధ్య ఓ మహిళకు 63 వేల డాలర్ల బదిలీ
  • యూఎస్ ఎథిక్స్ కమిటీకి తనపై నేరారోపణ చేసే అధికారం లేదన్న గేట్జ్ 

డొనాల్డ్ ట్రంప్ మాజీ అటార్నీ జనరల్‌ మాట్ గేట్జ్‌పై తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. ఆయన కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నప్పుడు శృంగారం కోసం వేల డాలర్లు చెల్లించారని, చట్ట విరుద్ధంగా డ్రగ్స్ కలిగి ఉన్నారని యూఎస్ ఎథిక్స్ కమిటీ ఆరోపించింది. అంతేకాదు, 2017లో 17 ఏళ్ల అమ్మాయితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని పేర్కొంది. యూఎస్ మీడియా రిపోర్టులను ఉటంకిస్తూ న్యూస్ ఏజెన్సీ ‘రాయిటర్స్’ ఈ మేరకు నివేదించింది.

ప్యానల్ రిపోర్టు ప్రకారం.. ఫ్లోరిడా అత్యాచార చట్టం సహా పలు చట్టాలను గేట్జ్ ఉల్లంఘించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో గేట్జ్  అటార్నీ జనరల్‌గా పనిచేశారు. మహిళలతో శృంగార కార్యకలాపాల కోసం 2017 నుంచి 2020 వరకు క్రమం తప్పకుండా డబ్బులు చెల్లించారు. అంతేకాదు, 2017లో 17 ఏళ్ల అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్టు నివేదిక పేర్కొంది. 

హౌస్ రూల్స్‌ను గేట్జ్ అతిక్రమించినట్టు కమిటీ నిర్ధారించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించింది. వీటిలో వ్యభిచారం, చట్టబద్ధమైన అత్యాచారం, మాదకద్రవ్యాల అక్రమ వినియోగం, హౌస్ గిఫ్ట్ రూల్స్ ఉల్లంఘన, అధికార దుర్వినియోగం, కాంగ్రెస్‌కు ఆటంకం కలిగించే నిబంధనలు, ఇతర ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వంటివి ఉన్నాయి. 

మొత్తం 12 మంది మహిళలకు గేట్జ్ పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేశారు. 2017 నుంచి 2020 మధ్యకాలంలో ఆయన మాజీ గాళ్‌ఫ్రెండ్‌గా చెప్పుకొనే గుర్తు తెలియని మహిళకు 63 వేల డాలర్లకుపైగా ఇలా బదిలీ అయింది. ఈ నెల మొదట్లో సీక్రెట్ ఓట్ ద్వారా ఈ నివేదికను విడుదల చేశారు. 

ఓ ఈవెంట్ సందర్భంగా గేట్జ్ కోసం కొకైన్ తెచ్చానని, మొత్తం ఐదు సందర్భాలలో గేట్జ్ కొకైన్ తీసుకోవడాన్ని తాను చూశానని ఓ మహిళ చెప్పుకొచ్చినట్టు నివేదిక పేర్కొంది. తనపై వస్తున్న ఆరోపణలపై గేట్జ్ స్పందించారు. నిన్న ఫెడరల్ కోర్టులో సివిల్ ఫిర్యాదు చేస్తూ.. కాంగ్రెస్‌కు తాను రాజీనామా చేసిన తర్వాత హౌస్ ఎథిక్స్ కమిటీకి తనపై అధికార పరిధి లేదని వాదించారు. 

  • Loading...

More Telugu News