Allu Arjun: మరికాసేపట్లో చిక్కడపల్లి పీఎస్‌కు బన్నీ.. భారీగా పోలీసుల మోహరింపు
- ఈరోజు ఉదయం 11 గంటలకు పీఎస్‌కు రావాలని బన్నీకి పోలీసుల నోటీసులు
- మరికాసేపట్లో తన లాయర్‌తో కలిసి పీఎస్‌కు రానున్న అల్లు అర్జున్
- దీంతో పీఎస్ వద్ద భారీ బందోబస్తు
సంధ్య థియేటర్‌లో ఈ నెల 4న చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా సినీ నటుడు అల్లు అర్జున్‌కు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దాంతో మరికాసేపట్లో బన్నీ చిక్కడపల్లి పీఎస్‌కు రానున్నారు.
దీంతో పీఎస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆ పరిసరాల్లోకి ఆయన అభిమానులెవరూ రాకుండా చర్యలు చేపట్టారు. కాగా, తన లాయర్‌తో పీఎస్‌కు రానున్న అల్లు అర్జున్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇక ఇప్పటికే తన లీగల్ టీమ్ తో పోలీసుల నోటీసులపై బన్నీ చర్చించారు.
తొక్కిసలాట ఘటనపై ఇటీవల పోలీసులు 10 నిమిషాల వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించే అవకాశం ఉంది. అలాగే బన్నీ నిర్వహించిన మీడియా సమావేశంపైనా కూడా ప్రశ్నించవచ్చని తెలుస్తోంది.