Jagan: కాసేపట్లో బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకోనున్న జగన్

Jagan coming to Idupulapaya from Bengaluru

  • వైఎస్ ఘాట్ వద్ద నివాళి అర్పించనున్న జగన్
  • రేపు పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న వైసీపీ అధినేత
  • 27న బెంగళూరుకు తిరుగుపయనం

వైసీపీ అధినేత జగన్ ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. తొలుత ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత ప్రేయర్ హాల్ లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం కడప నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పులివెందులకు బయల్దేరుతారు. రాత్రికి పులివెందులలోని నివాసంలో బస చేస్తారు. 

రేపు ఉదయం 8.30 గంటలకు సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభిస్తారు. రాత్రికి పులివెందులలో బస చేస్తారు. 26న పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్ లో జరిగే వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత పులివెందుల నుంచి బెంగళూరుకు తిరుగుపయనమవుతారు.

  • Loading...

More Telugu News