Chandrababu: అమరావతి నిర్మాణం... మరో రూ. 2,723 కోట్ల పనులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Chandrababu gives permission for another Rs 2723 Cr Amaravati works

  • అమరావతి పనులను పరుగులు పెట్టించే పనిలో చంద్రబాబు
  • 1.18 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశం
  • రాజధాని రింగ్ రోడ్డుపై అధికారులతో చర్చ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. తాజాగా అమరావతిలో మరో రూ. 2,723 కోట్ల పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. సీఆర్డీయే 44వ సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. 

జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటి వరకు రూ. 47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది.

  • Loading...

More Telugu News