Prakasam District: ప్ర‌కాశం జిల్లాలో వ‌రుస‌గా మూడో రోజు భూప్ర‌కంప‌న‌లు

Earthquake in Prakasam District of AP for the Third Consecutive Day

  • జిల్లాలోని ముండ్ల‌మూరులో సోమ‌వారం స్వ‌ల్పంగా కంపించిన‌ భూమి
  • శ‌ని, ఆది వారాల్లో కూడా ఇలాగే భూప్ర‌కంప‌న‌లు 
  • భ‌యాందోళ‌న‌లకు గుర‌వుతున్న స్థానికులు      

ఏపీలోని ప్ర‌కాశం జిల్లాను వ‌రుస భూప్ర‌కంప‌న‌లు వ‌ణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్ల‌మూరులో సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో మ‌రోసారి స్వ‌ల్పంగా భూమి కంపించింది. కాగా, జిల్లాలో ఇలా భూప్ర‌కంప‌న‌లు రావ‌డం ఇది వ‌రుస‌గా మూడో రోజు. శ‌ని, ఆది వారాల్లో కూడా ఇలాగే భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో జిల్లా ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లకు గుర‌వుతున్నారు. ఈరోజు భూమి కంపించిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు భ‌యంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అస‌లేం జ‌రుగుతోందో అర్థం కావ‌ట్లేద‌ని స్థానికులు వాపోతున్నారు. 

  • Loading...

More Telugu News