Pushpa2: స్మగ్లింగ్‌ను గౌరవంగా చూపించే సినిమాకు రాయితీనా?: సీపీఐ నారాయణ
- ‘పుష్ప- 2’ విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయన్న నారాయణ
- అల్లు తరం వారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడమేంటని ప్రశ్న
- బాధిత కుటుంబానికి త్వరలోనే సాయం చేస్తామన్న నారాయణ
- తొక్కిసలాట ఘటనపై సమాజం సిగ్గుతో తలదించుకోవాలన్న సీపీఐ నేత
అల్లు అర్జున్ నటించిన పుష్ప- 2 సినిమా విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయి అని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. స్మగ్లింగ్‌ను గౌరవంగా చూపించిన సినిమాకు రాయితీ ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదర్శ నటులైన అల్లు తరం వారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ మహిళ తన కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు తన ప్రాణాలను బలిపెట్టిందని, సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుని ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కళాకారులు, సాహితీవేత్తలదేనని అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన నారాయణ.. ఆ కుటుంబానికి తమవంతు సాయం అందిస్తామని ప్రకటించారు.