food: ఈ ఫుడ్స్‌ వేర్వేరుగానే తినాలి... కలిపి తింటే డేంజరే!

food combinations that are dangerous for your health

  • ప్రతి ఆహార పదార్థంలో కొన్ని ప్రత్యేకమైన రసాయన సమ్మేళనాలు
  • వాటిని కలిపి తిన్నప్పుడు ప్రతిచర్యలు జరిగే అవకాశం
  • దానితో కడుపునొప్పి నుంచి అలర్జీల దాకా ఎన్నో సమస్యలు వస్తాయంటున్న ఆరోగ్య నిపుణులు

సాధారణంగా ఆహార పదార్థాలన్నింటిలో వివిధ రకాల ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, వివిధ రకాల రసాయన సమ్మేళనాలు ఉంటాయి. వాటికంటూ ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అలాంటి ఆహార పదార్థాలను కలిపి తీసుకున్నప్పుడు.. రసాయన సమ్మేళనాల మధ్య ప్రతిచర్యలు జరిగే అవకాశం ఉంటుందని... దానితో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కడుపు నొప్పి, పొట్టలో ఉబ్బరం, అలర్జీలు, గ్యాస్‌, పేగుల్లో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. మన ఆయుర్వేదం కూడా ఈ లక్షణాల ఆధారంగానే కొన్ని రకాల పదార్థాలను కలిపి తీసుకోవద్దని సూచించిందని పేర్కొంటున్నారు.

చేపలు, పాలు:- ఆయుర్వేద సూత్రాల ప్రకారం చేపలు, పాలను కలిపి తీసుకోకూడదు. అలా చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

పాలు-తులసి:- ఈ రెండింటినీ కలిపి తీసుకోవద్దని... ఒక వేళ తీసుకోవాల్సి వస్తే కనీసం 30 నిమిషాలు గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వెన్న ఉండే ఫుడ్‌-కూల్‌ డ్రింక్స్‌:- వెన్న శాతం అత్యధికంగా ఉండే ఆహారాన్ని, కార్బోనేటెడ్‌ కూల్‌ డ్రింక్‌ లను కలిపి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. వెన్నలోని కొవ్వు పదార్థాలు, కూల్‌ డ్రింక్స్‌ లోని యాసిడ్లు కలసి పొట్టలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని వివరిస్తున్నారు.

పాలు-పళ్లు:- అరటి పళ్లు, నిమ్మ, ఆరెంజ్‌ వంటి సిట్రస్‌ పళ్లను పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నెయ్యి- తేనె:- ఈ రెండు పదార్థాలను ఎప్పుడూ సమపాళ్లలో కలిపి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. రెండొంతుల నెయ్యి, ఒకవంతు తేనెను కలిపి తీసుకోవచ్చని వివరిస్తున్నారు.

భోజనం-పళ్లు:- సాధారణ భోజనంలో పళ్లను కూడా కలిపి తీసుకోవద్దని, భోజనం చేసిన వెంటనే కూడా పళ్లు తినొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణశక్తిని దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు.

హై ప్రొటీన్‌ ఫుడ్స్‌:- గుడ్లు, మాంసం వంటి అత్యధిక ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని ఎప్పుడూ కలిపి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

హైప్రొటీన్‌ ఫుడ్‌-బంగాళదుంప:- బంగాళదుంపల్లో స్టార్చ్‌ ఎక్కువ. ప్రొటీన్లు జీర్ణంకావడానికి, స్టార్చ్‌ జీర్ణంకావడానికి వేర్వేరు ఎంజైములు అవసరమని... రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణ శక్తి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

టమాటా-దోసకాయ:- ఈ రెండింటిని కలిపి తీసుకుంటే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


  • Loading...

More Telugu News