offbeat: హెయిర్​ కటింగ్​ మధ్యలో లేచి పరుగెత్తి... పోలీసును కాపాడిన యువకుడు... వైరల్​ వీడియో ఇదిగో!

man runs midway through haircut to help policeman under attack

  • ఓ రోడ్డుపై దుండగుడిని అటకాయించిన పోలీసు అధికారి
  • అతడిపైకి తిరగబడి దాడి చేసిన దుండగుడు
  •  హెయిర్ కటింగ్ చేయించుకుంటున్న యువకుడు పరుగెత్తి కాపాడిన తీరు...

అది పెద్దగా మనుషుల సంచారం లేని రోడ్డు... అక్కడో దుండగుడు పోలీసు అధికారికి ఎదురయ్యాడు. అతడిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసు అధికారి ప్రయత్నించాడు. కానీ ఆ దుండగుడు బలంగా పోలీసుపై తిరగబడ్డాడు. కింద పడేసి దాడి చేశాడు. సమీపంలోని ఓ సెలూన్ లో హెయిర్ కటింగ్ చేయించుకుంటున్న యువకుడు ఇదంతా గమనించాడు. వెంటనే హెయిర్ కటింగ్ మధ్యలో నుంచే లేచి వేగంగా పరుగెత్తాడు. వేగంగా రోడ్డు దాటి వెళ్లి దుండగుడిపై పిడిగుద్దులు కురిపించి... గట్టిగా పట్టుకున్నాడు. దానితో పోలీసు అధికారి సురక్షితంగా పైకి లేచాడు. కాసేపట్లోనే చుట్టుపక్కల ఉన్నవారు అక్కడికి చేరుకుని దుండగుడిని పట్టుకున్నారు.
  • యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)లోని వారింగ్టన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేగంగా పరుగెత్తుకెళ్లి పోలీసును కాపాడిన యువకుడిని కైల్ వైటింగ్ గా గుర్తించారు.
  • సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ ఘటన వీడియో వైరల్ గా మారింది. 
  • హెయిర్ కటింగ్ కోసం మెడకు కట్టిన వస్త్రం అలా ఉండగానే కైల్ వైటింగ్ పరుగెత్తిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. సూపర్ మ్యాన్ లా ఉన్నాడంటూ కామెంట్లు వస్తున్నాయి.
  • మనలోనే ఉన్న హీరో అతను అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
  • ఈ వీడియోకు రెండు రోజుల్లోనే రెండున్నర మిలియన్ల వ్యూస్ రాగా, పెద్ద సంఖ్యలో లైకులు నమోదవుతున్నాయి.

  • Loading...

More Telugu News