Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఏపీ సర్కార్ షాక్

AP fibernet notices to Ram Gopal Varma

  • ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ అయిన 'వ్యూహం' సినిమా
  • వ్యూస్ లేకున్నా వర్మకు రూ. 1.15 కోట్లు చెల్లించారంటూ నోటీసులు
  • వడ్డీతో సహా ఆ మొత్తాన్ని చెల్లించాలన్న ఫైబర్ నెట్ కార్పొరేషన్

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో 'వ్యూహం' సినిమాకు అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందారన్న వ్యవహారంపై వర్మకు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు పంపింది. ఫైబర్ నెట్ ప్రస్తుత ఛైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు... అప్పటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేశారు.

ఫైబర్ నెట్ ద్వారా టెలికాస్ట్ చేసిన 'వ్యూహం' సినిమాకు వ్యూస్ లేకున్నా... ఫైబర్ నెట్ నుంచి రూ. 1.15 కోట్లు చెల్లించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నింబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు 15 రోజుల్లోగా వడ్డీతో సహా ఆ మొత్తాన్ని చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News